Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ
నవతెలంగాణ-కల్చరల్
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వాగ్గేయ కారుల, పద సాహితీకారుల పాత్రలను గొప్పగా పోషించిన అక్కినేని నాగేశ్వరరావు అపూర్వ సాధకుడు అని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ కొనియాడారు. ప్రపంచంలో సుదీర్ఘ నట జీవితం గడిపి పల్లె నుంచి ఉన్నత శిఖరాలను చేరుకున్న అక్కినేని జీవితం క్రమ శిక్షణ ఈ తరం నేర్చుకోవాలని ఆయన సూచించారు. శ్రీత్యాగరాయ గానసభ ప్రధానవేదికపై శ్రీ భారతి సంగీత సాహిత్య కళా వికాస వేదిక నిర్వహణలో అక్కినేని జయంతి పురస్కరించుకుని భిన్న రంగాలకు చెందిన ప్రముఖులకు శ్రీభారతి అక్కినేని జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ రమణ పాల్గొని నటి రోజారమణి, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, వంశీ సంస్థల అధినేత వంశీ రామ రాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనముర్తి, గాయకుడు రామాచారిలను జీవన సాఫల్య పురస్కారలతో సత్కరించారు. అధ్యక్షత వహించిన విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారి డాక్టర్ గోపినాథ రెడ్డి మాట్లాడుతూ అక్కినేని నటించిన ప్రతి సినిమా ఒక పాఠం అన్నారు. నంగనూరి చంద్ర శేఖర్, దైౖవజ్ఞ శర్మ తదితరులు తమ అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి తొలుత చింతల పాటి సురేష్, రామా చారి శిష్య బృందం, వీ. కె దుర్గ తదితరులు మధుర గీతాలను ఆలపించారు.