Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
రైతుల శ్రేయస్సు కొరకే సహకార సంఘాలు పనిచేస్తున్నాయి అని తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం చైర్మెన్, డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మన్నెగూడలోని జేఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం తుర్కయంజాల్ సహకార సంఘం 47వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 12మంది ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఎఫ్ఎస్సీఎస్ పనిచేస్తుందన్నారు. రైతుల సహకారంతో గత ఏడాది రూ.2.16కోట్ల నికర లాభం బ్యాంకు గడించినట్లు తెలిపారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే సహకార సంఘం ఇంకా అభివృద్ధి పథంలో దూసుకెళ్లే అవకాశం ఉందన్నారు. సహకార సంఘంలో సభ్యులైన రైతులకు పవర్ ఫీడర్లు, కుట్టిమిషన్లు, వ్యవసాయ పరికరాలను ఇప్పటికే అందజేశామన్నారు. సంఘ సభ్యులు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే మూడు రోజుల్లోపు రూ.25వేల ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. దీంతో తుర్కయంజాల్ సహకార సంఘంపై రైతులకు ఎనలేని గౌరవం, ఆదరణ లభించిందన్నారు. కోహెడలో బ్యాంకుకు చెందిన ఐదెకరాల స్థలంలో ఏడాది లోపు గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా చైర్మెన్ వంగేటి లక్ష్మారెడ్డి, బ్యాంకు వైస్ చైర్మెన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు చెక్క లక్ష్మమ్మ, సామ సంజీవరెడ్డి, కుతాడి నర్సింగరావు, కొండ్రు స్వప్న, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, జక్క కృష్ణారెడ్డి, సామ సత్యనారాయణ రెడ్డి, జక్క రాంరెడ్డి, జిట్టా భార్గవి, మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నేతలు కందాల బలదేవరెడ్డి, గుండ్ల రాజిరెడ్డి, గుండా ధన్రాజ్, పుల్లగుర్రం విజయానంద్రెడ్డి, కొండ్రు శ్రీనివాస్, బ్యాంకు మేనేజర్ రాందాసు, రైతులు పాల్గొన్నారు.