Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి
నవతెలంగాణ-హయత్‌నగర్
పుస్తక పఠనంతోనే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నట్లు మంగళవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గీతా నాయక్ రచించిన ''ఎలిమెంట్స్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్'' అనే నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత డాక్టర్ గీతానాయక్ మాట్లాడుతూ ఈ పుస్తకం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. బిఎ కోర్స్ చదువుతున్న అన్ని విభాగాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉంటుందని వివరించారు. పుస్తక పఠనంతోనే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేదించవచ్చని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ పార్థసారథి, హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోత్స్న ప్రభ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి పుస్తక రచయిత డాక్టర్ గీతా నాయక్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలన శాస్త్ర అధ్యాపకులు, వివిధ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఇంతియాజుద్దీన్ ఫారుఖీ, డాక్టర్ శంకర్ నాయక్, డాక్టర్ రాకేష్ భవాని, డాక్టర్ జహీదా బేగం, డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ రామాచారి, డాక్టర్ రవి కుమార్, డాక్టర్ సురేష్, డాక్టర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.