Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని సాగర్ రింగ్‌రోడ్ బైరామల్‌గూడ విలేజ్ సర్వే నెంబర్ 24 నందు 13 గుంటల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని హైస్కూల్‌కు కేటాయించి నిధులు వెచ్చించి వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాల నిర్మాణం పూర్తిచేయాలని కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మెన్ చెన్నోజు శ్రీనివాసులు తమ ప్రతినిధులతో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్తి నాపురంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేక అనేకమంది నిరుపేదలు విద్యకు దూరమవుతున్నారని, అనేకమంది ప్రైవేట్‌లో ఫీజులు చెల్లించలేక డ్రాప్‌అవుట్ అవుతూ గెంటివేత, బహిష్కరణకు గురై బాల కార్మికులుగా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. హైస్కూల్ ఏర్పాటు చేయా లని గత ఐదు సంవత్సరాల నుండి పోరాడుతున్నామని, అందులో భాగంగా 2018లో నిరాహార దీక్ష చేయడం జరిగిందని అప్పటి ఎమ్మెల్యే, ఉన్నతా ధికారులు హైస్కూల్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని. ఈ విష యాన్ని అనేకసార్లు మంత్రులు, విద్యాశాఖ ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోయి నప్పటికీ నాలుగు సంవత్సరాల నుండి స్థలం కేటాయించి, నిధులు వెచ్చించి పాఠశాల నిర్మాణం చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలగజేసుకొని ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో సమావేశం ఉన్నదని, ఆ స్థలాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏర్పాటుకై కలెక్టర్‌తో స్వయంగా కలిసి న్యాయం చేస్తానని, వచ్చే విద్యా సంవత్సరానికి నిధులు వెచ్చించి, యుద్ధ ప్రాతిపాదికన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసి పేదలకు విద్య దూరం కాకుండా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు జేసీసి ప్రతినిధులు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ ముఖ్య సలహాదారులు గంగుల నరసింహారెడ్డి, న్యాయ సలహాదా రులు హైకోర్టు అడ్వకేట్ రంగాచారి, మల్గిరెడ్డి శ్రీనివాస రెడ్డి, రవికుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.