Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
- బతుకమ్మ చీరల పంపిణీ షురూ
నవతెలంగాణ-ఓయూ/మల్కాజిగిరి/అడిక్‌మెట్/కుత్బుల్లాపూర్
తెలంగాణలోనే అన్ని పండుగలకు ఆదరణ లభించిందని, ఈ గొప్పదనం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. అన్ని మతాలకు చెందిన పండుగలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహించే సంప్రదాయాన్ని పాటిస్తోందని చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని తన నివాసంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫల్‌మండీ, బౌద్దనగర్ డివిజన్లలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుపుతున్నట్లు తెలిపారు. అర్హులందరికీ చీరలు లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ దశరథ్, యూసీడీ ప్రాజెక్టు అధికారి శ్రీనాథ్, టీఆర్ఎస్ యువ నేత కిషోర్ పాల్గొన్నారు.
మల్కాజిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీ రాజు, ప్రాజెక్టు అధికారి మల్లికార్జున్, కార్పొరేటర్లు సునీత రామూయాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్ధం పరశురామ్ రెడ్డి, జీఎన్వీ సతీష్ కుమార్, పిట్ల శ్రీనివాస్, రాము యాదవ్, గుండా నిరంజన్, ఉపేందర్ రెడ్డి, ఎస్ఆర్ ప్రసాద్, మోహన్ రెడ్డి, సంతోష్ రాందాస్, బాబు, సత్యనారాయణ, భాగ్యనందరావు, సత్తయ్య, కన్నా, సూరి, ఆదినారాయణ, బాలకృష్ణ, మంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పేదింటి ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్ కమిటీ హాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిల్‌కు చెందిన మహిళలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బతుకమ్మ చీరలను పంపిణీచేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 1,61,821 మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీలు మంగతాయారు, ప్రశాంతి, కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మెన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మెన్ గంగయ్య నాయక్, నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, దుండిగల్ వైస్ చైర్మెన్ తుడుం పద్మారావు, సీఓ పాపన్న గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ టి లక్ష్మారెడ్డి, బసవరాజ్, సాంబయ్య, బీసు వెంకటేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డితో కలిసి తార్నాక డివిజన్లోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. పేద, మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా సగర్వంగా పండుగలను జరుపుకునే సంస్కృతిని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్పించారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రతి మహిళ తన రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూపించి బతుకమ్మ చీరను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీపీఓలు శ్రీనాథ్, శ్రీవాణి, టీఆర్ఎస్ నాయకులు వేణు గోపాల్ రెడ్డి, శివశంకర్, బాబు, సతీష్ యాదవ్ పాల్గొన్నారు.