Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో/అడిక్‌మెట్
పోషణ లోప రహిత జిల్లాగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్ రావు ప్రస్తుతం జిల్లాలో సామ్, మాం, అండర్ వెయిట్ పిల్లలు మొత్తం అంగన్వాడీల్లో ఎంతమంది ఉన్నారో వివరించడంతో పాటు వారిపైన మానిటరింగ్ పెట్టి వారి ఎదుగుదల సరియైన స్థితిలోకి తేవాలని వివరించారు. ఇందుకోసం లైన్ డిపార్టుమెంట్స్ సహకరించాలనీ, పోషణ అభియాన్‌లో భాగంగా ఇచ్చిన ప్రతి టార్గెట్‌ను చేరుకోవాలని తెలిపారు. అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో జయమాల మాట్లాడుతూ రక్తహీనత తగ్గాలంటే పిల్లలు కిశోర బాలికలల ఉన్నప్పటి నుంచి వారికి సరియైన ఆహారం తీసుకోవడం పట్ల అవగాహన కలిగించాలని సూచించారు. ప్రతిఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలనీ, సురక్షిత ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరుగుతాయని ఆ విధంగా ప్రజలను మోటివేట్ చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో కార్యాలయ ఏడీ బి.శ్రీనివాస్ రెడ్డి, సీఆర్వో ఆర్.టీ నాయక్, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ టీం, ఏడబ్లూటీలు పాల్గొన్నారు.
సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం అవసరం
సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం అత్యంత అవసరం అని జై భీమ్ సేన్ జాతీయ అధ్యక్షులు బల్వంత్ అన్నారు. మంగళవారం అడిక్‌మెట్ డివిజన్ లలితానగర్ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు పోషకాహార లోపంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జై భీమ్ సేన బల్వంత్, అంగన్వాడీ టీచర్ అనుజ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన ఉండాలని సూచించారు. పోషకాహార లోపం వల్ల రక్తహీనత, పిల్లల్లో మానసిక పెరుగుదల లోపిస్తుందని తెలిపారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ఆహారం తీసుకుంటే శరీరానికి తగిన విటమిన్లు పోషక విలువలు లభిస్తాయో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన ద్వారా తెలియజేస్తామని తెలిపారు. విద్యార్థులు సంపూర్ణ ఆహారంతో రక్తహీనత జయించవచ్చని అన్నారు.