Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
వైఎస్సార్టీపీ మేడ్చల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా జవహర్‌నగర్‌కు చెందిన పాకాల దానియల్ను ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నియమించారు. ఈ మేరకు దానియల్ షర్మిలను బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పాకాల దానియల్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో కట్టిబెట్టిన ఈ బాధ్యతను సమర్దవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ పురోగాభివృద్ధికి ఎల్లవే ళలా కృషి చేస్తాననీ, మేడ్చల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ షర్మిళ ప్రజాసమ స్యలపై పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ అవినీతిని ఎండగడు తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ విజయానికి కష్టపడి పని చేయాలన్నారు. 8 ఏండ్లలో కేసీఆర్ ఒక్క వర్గాన్ని కూడా ఆదరించలేదన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదనీ, మహిళాలకు వడ్డీ లేని రుణాలు అందలేదనీ, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదనీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదనీ, కనీసం నిరుద్యోగ భృత్తి కూడా ఇవ్వలేదనీ, వివిధ కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌కు ప్రజలు ఓటు ఎందుకు వేయాలని ఆలోచనతో ఉన్నారన్నా రు. ప్రజలంతా ఏకమై తిరుగబడాలన్నారు. వైఎస్సార్టీపీ సంక్షేమ పాలన వస్తేనే ప్రజల బాధలు. కష్టాలు తగ్తుతాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాలల్లో పరు గులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా కో- ఆర్డినేటర్ కల్పన గాయత్రి పాకాల సుప్రియ సాయిరెడ్డి తాడికొండ అశోక్ జయరాజ్ రామునాయక్ శ్రీరాం శ్రీకాంత్ (బుల్లెట్ లడ్డు) కొండూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.