Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్ నగర్
స్వేచ్ఛ వేదిక సేవలు అమోఘం అని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలో స్వేచ్ఛ వేదిక సొసైటీ డైరెక్టర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల బాలాజీ నగర్లో 10 చిన్నారులకు ఉచిత స్టీల్ వాటర్ బాటిల్స్‌ను ముత్తూట్ జార్జ్ ఫౌండేషన్ సీఎస్ఆర్ మేనేజర్ లక్ష్మీనారాయణ ఆర్థిక సహకారంతో అందజేశా రు. ఈ సందర్భంగా రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యా వరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాలాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో స్టీల్ వాటర్ బాటిల్‌ని అందించినందుకు స్వేచ్ఛ వేదిక సొసైటీ డైరెక్టర్ రాజు యాదవ్‌ను అభిన ందించారు. మూడేండ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్ర మాల ద్వారా ఎంతో మందికి ఉపయోగపడుతున్న స్వేచ్ఛ వేదిక సొసైటీ సంస్థను చేసే సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని చెప్పారు. ప్లాస్టిక్ పైన ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఇందుకు ముత్తూట్ జార్జ్ ఫౌండేషన్ వారు స్టీల్ వాటర్ బాటిల్‌ను అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ముత్తూట్ సంస్థ వారు చేసిన సేవలను కొనియాడారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలనీ, ఇందు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డైరెక్టర్ రాజు యాదవ్ చెప్పారు. రెండేండ్లుగా ముత్తూట్ జార్జ్ ఫౌండేషన్‌తో కలిసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ, అందులో భాగంగానే ఈ స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయు లు ప్రశాంతి, స్వేచ్ఛ వేదిక సొసైటీ కో-ఆర్డినేటర్లు, బాలాజీ, చరణ్, గణేశ్, రాజు, శరణ్, ముత్తూట్ సంస్థ లక్ష్మీనారాయణ ప్రతినిధులు పాల్గొన్నారు.