Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మల్కాజిగిరి ప్రెస్ క్లబ్లో 143 నూతన కమిటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైనా జార్జి విల్సన్‌ను ఎమ్మెల్యే సన్మానిం చారు. మౌలాలి డివిజన్ పరిధిలోని ఎస్పీ నగర్ సూర్య రామ్ అపార్ట్మెంట్ వాసులు రోడ్డు, మంచినీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కరిం చేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ మహేష్, ఏఈ మధులత, కాలనీ వాసులు, లక్ష్మిరెడ్డి, నిర్మల, విజయలక్ష్మి, జయశ్రీ, సురేష్, మినేశ్వర్రావు, దశరద్రెడ్డి, శ్రీనివాస్, నాయకులు అమీనుద్దీన్, సతీష్‌కుమార్, గుండా నిరంజన్, భాగ్యనంద్, సత్తయ్య, సంతోష్ నాయుడు, మంద భాస్కర్, ఆదినారా యణ, గౌలికర్ దినేష్, మోహన్ రెడ్డి, సంతోష్ రాందాస్, సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు
బతుకమ్మ చీరలు పంపిణీ..
గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మధుసూదన్‌నగర్ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ చీరలను కార్పొరేటర్ మేకల సునీత రామూయాదవ్, కమిషనర్ రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలు దివ్యజ్యోతి, సత్యలక్ష్మి, ప్రాజెక్ట్ అధికారి మల్లికార్జున్, రాముయాదవ్, తదితరులు పాల్గొన్నారు
ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో హరితహారం..
హరితహారంలో భాగంగగా ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ బీజేఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమ ంలో డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి, బాబు, నవీన్ యాద వ్, ఉమాపతి, జంగరాజు ఉపేందర్, కవిత, కార్యదర్శి పద్మ, వైశాలి, కిషోర్, శ్రీధర్ రవి, సచిన్ కుమార్, హార్టిక ల్చర్ ఆధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజి గిరి మీడియా కన్వీనర్ నిరంజన్, వెంకటేష్ పాల్గొన్నారు.