Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో మేడ్చల్ జిల్లా
- ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలి
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారనీ, వాటిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనీ, ఈ విషయంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్వచ్ఛ గురుకులాలు, మన ఊరు- మన బడి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో మంచి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మంచి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు చేస్తే ఏమైనా ఇబ్బందు లు ఉంటే వాటిని కూడా పరిష్కరించినట్టు వివరించారు. గురుకులాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనీ, అధికారులు సైతం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మన ఊరు-మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు పాఠశాలలకు దీటుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,200 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. జిల్లాలో పాఠశాలల ను అభివృద్ధి చేసి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చినట్టు తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం ఎంతో గర్వకార ణంగా ఉందనీ, ఈ విషయంలో జిల్లా అధికార యంత్రా ంగం, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా అన్ని రంగాల్లో ముందు స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్మించిన రైతువేదికల ను రైతులకు ఉపయోగపడే విధంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు సంబంధిత వ్యవసాయాధికా రులు సూచనలు, సలహాలు అందజేయడంతోపాటు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా వారి సమస్యలను పరిష్కరించాల ని సూచించారు. రైతులను ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బందు లు కలగకుండా చూడాల్సిందిగా పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యానవన పంటలను ఎక్కువ మొత్తంలో పెంచేందుకు హార్టికల్చర్ అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థా యిలో పర్యటించి రైతులకు వాటి గురించి వివరించాల న్నారు. పందిరి సాగు, కూరగాయల సాగుకు సబ్సిడీ వివరాలను ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లోని రైతులకు తెలియజేస్తూ ఉద్యానవన పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లా కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు పండించేందుకు అనుకూలంగా ఉండటంతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు రవాణా చేసేందుకు కూడా అవకాశం ఉందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో కృషి చేయాలనీ, తాను అందరికీ సహకారం అందిస్తానని తెలి పారు. ఈ సందర్భంగా జిల్లాలో వ్యవసాయం, ఉద్యావనం, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, జిల్లా పంచాయతీ, మత్స్యశాఖ, అటవీ శాఖలతోపాటు ఆయా శాఖలు చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ అంశా లపై సంబంధిత అధికారులను మంత్రి, జెడ్పీ చైర్మెన్, జెడ్పీ టీసీ, ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానాలివ్వడంతో పాటు అందుకు సంబంధించి వివరాలను తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జెడ్పీ వైస్ చైర్మెన్ బెస్త వెంకటేశ్, జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జెడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా వ్యవసాయాధికారిణి రేఖామేరీ, జిల్లా ఉద్యానవనశాఖ అధికారిణి నీరజాగాంధీ, జిల్లా మత్స్యశాఖ అధికారిణి పూర్ణిమ, జిల్లా అటవీ శాఖ అధికారి జోజి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణితో పాటు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.