Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులపై మహిళ ఆగ్రహం
- రోడ్డుపై రాంగ్రూట్లో పార్కుచేశారని కారుటైర్లకు లాక్‌చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
- పోలీసుల తీరుపై మండిపడ్డ మహిళ ొ కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
' నా కారుకు లాక్ ఎలా వేస్తారు? ' అని ఓ మహిళ ట్రాఫిక్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దుర్భాషలాండింది. బుధవారం సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం కాకినాడకు చెందిన దివ్యజ్యోతి కోఠిలో మెయిన్‌రోడ్డుపై కారును పార్క్ చేసింది. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సంతోష్ కారుకు టైర్లకు లాక్ వేశాడు. విషయం తెలుసుకున్న దివ్య జ్యోతి తన కారుకు కార్ లాక్ ఎలా వేస్తారని సదరు కానిస్టేబుల్‌ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ కానిస్టేబుల్‌ను దుర్భాషలాడుతూ వాకీటాకీన్ గుంజుకునే ప్రయత్నం చేసింది. ఇది గమనించి ప్రజలు ఆమెను వారిస్తున్నా వినకుండా వాకీటాక్ లాగేసింది. సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఎస్సై శ్రావణ్ కుమార్ సుల్తాన్ బజార్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు మహిళపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.