Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
శాంతి, అహింస ద్వారానే ఏదైనా సాధించవచ్చని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ ఐఐటీ బాసర మాజీ వైస్ ఛాన్సలర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ అశోక్ అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం, ఆంధ్ర మహిళాసభ సంయుక్త ఆధ్వర్యంలో ఓయూ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆడిటోరియంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన శాంతి సదస్సులో బాసర మాజీ వీసీ డాక్టర్ అశోక్ పాల్గొని ప్రసంగించారు. భారతదేశం అనాదిగా శాంతి, అహింసా మార్గాన్ని అనుసరిస్తోందని అన్నారు. ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ అక్తర్ అలీ మాట్లాడుతూ సర్వమత సమ్మేళనంగా హైదరాబాద్ నగరంలోని అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి ఉంటూ శాంతిని కోరుతున్నారని అన్నారు. ఓయూ ఎకనామిక్స్ శాఖ ప్రొ.ఏ. నాకుల రెడ్డి, ఏఎంఎస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ఝాన్సీ రాణి, ఓయూ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ రవి తేజ, ఆంగ్ల భాష అసోసియేట్ ప్రొ. డాక్టర్ కె. కరుణ దేవి, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ స్వాగతోపన్యాసం చేస్తూ తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అంతర్జాతీయ శాంతి సంస్థ అమెరికాకు చెందిన అమీర్ అలీఖాన్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ నిర్విరామంగా 15 ఏండ్లుగా శాంతి సామరస్యంపై అనేక కార్యక్రమాలు నిర్వహించినందుకు ఫారుక్ అలీ ఖాన్ను శాలువా, పూలమాల, మొమెంటోతో ఘనంగా సత్కరించారు. శాంతి అంశంపై బీటెక్ స్టూడెంట్ తిరుపతి, నాగరాణి ప్రసంగాన్ని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్మయి ఎన్ఎస్ , సరిత, అలివేణి కో ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. కళాశాల విద్యార్థులు సాత్విక, అఖిల, సంజన పాల్గొని ప్రసంగించారు.