Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
- ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ
నవతెలంగాణ-అడిక్మెట్
పేదలు గొప్పగా బతకాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్దేశమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దేశంలో ఎక్కడ కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ చిత్రాల బస్తి, ఉన్నికోట, ముగ్గు బస్తి సింగాడి కుంట రోటరీ కాలనీలో స్థానిక కార్పొరేటర్ రచన శ్రీతో కలిసి అర్హులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు వద్ధులు, వితంతువులకు రూ.200, వికలాంగులకు రూ.500 పెన్షన్ ఇచ్చేవారిని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ వద్ధులు, వితంతువులకు రూ.2016, వికలాంగులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.3016 పెంచడం జరిగిందన్నారు. పింఛను డబ్బుల కోసం లబ్దిదారులు అక్కడా, ఇక్కడా తిరిగే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయన్నారు. కార్యక్రమాలో యువ నాయకులు ముఠా జయసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వల్ల శ్యామ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మచ్చకుర్తి ప్రభాకర్, చిత్రాల్నగర్ మాజీ అధ్యక్షులు విశ్వనాధ్, హరికాంత్, యాదగిరి, శ్యామ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.