Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం నల్లకుంట డివిజన్లోని భాగ్యనగర్ కాలనీలో రూ.3 లక్షలతో చేపడుతున్న డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ అమృతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి నూతన పైపులైన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.