Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రంలో నేతకాని మహర్ సామాజిక వర్గానికి చెందిన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేతకాని మహర్ సంఘాల నాయకుల ఆత్మీయ నదస్సు గురువారం జరిగింది. ప్రొఫెసర్ జాడీ ముసలయ్య, ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజినీర్ ముడిమడుగుల శంకర్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై ప్రసంగించారు. నేతకాని కులస్తులకు ఆత్మగౌరవ భవనం మంజూరు కోసం కషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ జాడి ముసలయ్య మాట్లాడుతూ నేతకాని కులస్తులు ఏజెన్సీ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నందున, ఏజెన్సీ ఏరియాలోని దళితులకు ప్రత్యేక రాయితీలు కల్పించి, ఆర్థికాభివద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అనేక ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో నేతకాని సామాజిక వర్గానికి జనాభా దామాషా కారం అవకాశాలు కల్పించాలని కోరారు. తెలంగాణ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత మాట్లాడుతూ విద్యా, ద్యోగ రంగాల్లో ఏజెన్సీ దళితులకు తీరని అన్యాయం జరుగుతోందని, ఏజెన్సీలో నివసించే దళితులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతకాని కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం గోపాల్, నేతకాని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దర్శనాల వనచంద్ర, నాయకులు దుర్గం రాజేష్, కలాలి నర్సయ్య, గొల్లె రాజయ్య, రామకష్ణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.