Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్
నవతెలంగాణ-ఘట్కేసర్
మండలపరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ మంత్రి మల్లారెడ్డిని, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని, జడ్పీ చైర్మన్మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డిని విమర్శించడం అది నీ స్థాయి కాదని టీిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీిఆర్‌ఎస్ పార్టీ నుండి టీటీసీి గెలిచి మా భిక్షతో ఎంపీపీ అయిన సంగతి మరు వద్దన్నారు. బీజేపీి పార్టీ మారినంత మాత్రాన మంత్రి మల్లారెడ్డిని, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని జడ్పీ చైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డిని విమర్శించడం నీ స్థాయి కాదు అని మరువద్దని ఆయన హెచ్చరించారు. మళ్లీ టీిఆర్‌ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను విమర్శిస్తే ఎంపీపీగా మీరు చేసిన అక్రమాలు కూడా బయటపెట్టి నీకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరిం చారు. నీకు దమ్ముంటే ఎంపీటీసీగా, ఎంపీపీగా రాజీనామా చేసి బీజేపీ నుండి గెలుపొంది సత్తా చూపుతామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డి టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కందుల కుమార్, సహకార బ్యాంక్ మాజీ చైర్మెన్ డొంకని బిక్షపతి, నాయకులు సందీప్ రెడ్డి, శివ శంకర్, ధర్మారెడ్డి, ప్రదీప్ రెడ్డి, లింగం యాదy,్ శంకర్ గౌడ్, దామోదర్, మంకైయ శ్రీహరి, సంతోష్, నరసింహ చింతల గోపాల్ రెడ్డి, వేణు బుచ్చిరెడ్డి, నరసింహ అత్యధిక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.