Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో స్ధానిక కార్పొరేటర్ బి.సుజాత నాయక్ హెచ్.ఏం.డబ్ల్యూ.ఎస్ అధికారులతో కలిసి పర్యటిం చారు. కాలనీలో వర్షపు నీటి కాలువలోకి డ్రైనేజి లైన్ వెళ్ళడం వలన దుర్వాసనతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలాంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి కాలనీ అభివద్ధికి తోడ్పాటు అందించాలని కాలనీ ప్రతినిధులు కార్పొరేటర్‌ను కోరారు. వెంటనే సమస్య పట్ల స్పందించిన కార్పొరేటర్ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని హెచ్.ఏం. డబ్ల్యూ.ఎస్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రజలకు నీటి బిల్లుల చెల్లింపుపై అవగాహన కల్పించి మంచి నీటి సమస్య లేకుండా ఎగువ ప్రాంతాలలో వుండే ప్రజలకు మంచి నీరు సమానంగా అందేలా చూస్తామని సుజాత నాయక్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిండి లింగారెడ్డి, ఉపాధ్యక్షులు వంగూరి చంద్రశేఖర్ యాదవ్, కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, క్రాంతి, పర్వత్, మధు, అమర్, రంగారెడ్డిలతో పాటు టీి.ఆర్.ఎస్ నాయకులు జానకి రామ్ నాయక్ జి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.