Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని సాగర్ రోడ్ సమీపంలో వున్న నాగార్జున మోడల్ స్కూల్లో గురువారం రోజు సమాజంలోని వృత్తులను వివరించే విధంగా విద్యార్థుల చేత నాగార్జున విద్యాసంస్థల వైస్ చైర్పర్సన్ గుమ్మకొండ రజని విట్టల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులకు నాగరికత పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కార్య్రమాలను ఏర్పాటు చేశామని చిన్నారులు వివిధ వృత్తులకు సంబంధించిన వేషధారణలతో ఆకట్టు కున్నారని వారు ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలోని అన్ని వృత్తుల వారు సమన్వయంతో పనిచేసినప్పుడే సమాజం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులను ఉద్ధేశించి వారు ప్రసంగించారు.
ఇటువంటి ప్రదర్శనలతో పాటు విద్యార్థు లను తరచుగా క్షేత్ర పర్యటనల కోసం దగ్గరలోని ప్రదేశాలకు తీసుకుపోతున్నట్లు రజిని విట్టల్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విద్యాసంస్థల అకాడమిక్ డీన్ ఎస్.రాజశేఖర్, సీఏఓ అల్లు శేషారావు, పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.పద్మావతి ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.