Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
భగత్ సింగ్ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిచాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య హయత్ నగర్ మండల సమితి అధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శివ కుమార్, సహాయ కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ స్వాతంత్య్ర ఉద్యమంలో రాజీలేని పోరాటం చేశాడనీ, దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎందరో మహాను భావులు ప్రాణాలను సైతం అర్పించారన్నారు. వీరి లో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్ అన్నారు. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుందన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపింద న్నారు. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయే వీరుడు అంతటి మహౌన్న తనమైన భగత్ సింగ్ చరిత్రను యావత్తు సమాజా నికి తెలిసే విధంగా పాఠ్యాం శంలో ఆయన జీవిత చరిత్రను ఉంచాలని కోరారు. భగత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భగత్‌సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యార ంటీ యాక్టు ఏర్పాటు చేయడం వల్ల యువకులకు, ఆశాకిరణంగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో హయాత్‌నగర్ మండల అధ్యక్షుడు వంశీ వర్ధన్ రెడ్డి, సహాయ కార్యదర్శి అరుణ్ కుమార్‌గౌడ్, మెట్టు కార్యదర్శి వెంకటేష్, ఉపేందర్, జె.భాను ప్రకాష్, జిన్నె బన్నీ, వట్టి కార్తిక్, చుక్క అభి పాల్గొన్నారు.