Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- బన్సీలాల్ పేట డివిజన్లో పర్యటన
నవతెలంగాణ-బేగంపేట్
వచ్చే నెల 9వ తేదీ నాటికి అభివృద్ధి, వివిధ పనుల ను పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం బన్సీలాల్‌పేట డివిజన్లోని గాంధీ నగర్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. గాంధీనగర్ కమిటీ హాల్ పక్కనే ఉన్న పార్క్‌లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌తో ఇబ్బందికరంగా ఉందనీ, వేరే చోటకు తరలిస్తే పార్క్‌కు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు మంత్రికి విన్నవించగా, ట్రాన్స్ ఫార్మర్ను తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకో వాలని ఎలక్ట్రికల్మహేష్ కుమార్‌ను ఆదేశించారు. చిల్డ్రన్స్ పార్క్ మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి ఉండటంతో వెంటనే పార్క్‌ను శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకొ చ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్క్‌లో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. కమిటీ హాల్ ఎదురుగా ఉన్న పార్క్‌ను సందర్శించగా, మొత్తం పిచ్చి మొక్కలతో నిండి ఉండ టంతో దీన్ని కూడా రెండు, మూడు రోజులలో శుభ్రం చేసి స్థానిక ప్రజలు వినియోగించుకొనే విధంగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. రాత్రివేళ రోడ్లపై మద్యం సేవించడం, ఇతర చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు కొందరు మంత్రి దృష్టికి తీసుకురాగా, అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. తమ కాలనీలో పలు చోట్ల స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని, పలువురు తెలపగా, క్షేత్రస్థాయిలో పర్య టించి అవసరమైన చోట్ల వెంటనే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనులన్నీ యుద్దప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట కార్పొరేటర్ హేమ లత, జోనల కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ముకుంద రెడ్డి, సుదర్శన్, వాటర్ వర్క్స్ రమణారెడ్డి ఉన్నారు.