Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యంజాల జనార్దన్
నవతెలంగాణ-బడంగ్పేట్
అభివృధే ధ్యేేయంగా భావించి నిరంతరం ప్రజా సమస్యల పరిస్కారం కోసం పనిచేసే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విమర్శించే స్థాయి మీకులేదని మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యులు యంజాల జనార్దన్ అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలని తెలిపారు.దళితులంటే గౌరవం లేదని, డబల్ ఇంజిన్ ప్రభుత్వములో దేశంలో నిత్యం దళితులమీద దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆయన విమర్శించారు. జల్పల్లి మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బుడుమల యాదగిరి గెలిచి 03 సంవత్సరములు కావస్తున్నదని ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి వార్డును ఎంత అభివద్ధి చేశారో చెపాలని డిమాండ్ చేశారు. నిత్యం తొలివెలుగు రఘుని, తీన్మార్ మల్లన్నను కలిస్తే వార్డు అభివద్ధి చెందదని విమర్శించారు. కులాలు,మతాలు అంటూ అమావాస్య, పౌర్ణమికి వచ్చి మంత్రివర్యులు మీద అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకంను మండలాల వారిగా అర్హులైన వారికి విడతల వారిగా ప్రతి ఒక్కరికి అందుతుంద న్నారు. ఈ విషయంపై రాజకీయం చేయటం తగదన్నారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి రాజీనామా చేయాల్సింది కాదని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ దేశాన్ని అధోగతి పాలు చేస్తూ, కార్పొరేట్ సంస్థలకు, దేశ సంపదను దోచి పెడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జల్పల్లి పురపాలక సంఘంలో మంత్రి ఇప్పటికే కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపటటం జరిగిందన్నారు. మహిళా మంత్రిగా ప్రజల సంక్షేమం కోసం అలుపెరగని బాటసారిలా నియోజక అభివృద్దే లక్ష్యముగా పనిచేస్తున్నారన్నారని ఆయన హితవుపలికారు.ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ ఎస్ పార్టీ నాయకులు సైద్ పటేల్,నగేష్,మల్లేష్, అబ్బాస్, రవి తదితరులు ఉన్నారు.