Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదవ్ సంఘం నాయకులు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
సదర్ సమ్మేళన ఉత్సవాలను ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు యాదవ సంఘం నాయకులు తెలిపారు. యాదవ సంఘం అబ్దుల్లాపూర్మెట్ మండల అధ్యక్షులు బొడుసు శంకర్ యాదవ్ అధ్యక్షతన ఆదివారం సంఘం నాయకులు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ వచ్చే నెల దీపావళి పండుగ అనంతరం జరిగే సదరు సమ్మేళన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
దీపావళి పర్వదినం పురస్కరించుకొని మర్నాడు జరిగే ఉత్సవాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. సదర్ సమ్మేళనం వేడుకల్లో దున్నపోతులను అలంకరించి యాదవ కులస్తులు వాటితో కుస్తీపడుతూ ఉత్సవాలను నిర్వహిస్తారన్నారు. కార్యక్రమం లోయాదవ సంఘం రంగారెడ్డి జిల్లా వైస్ప్రెసిడెంట్ కొర్ర రాధాకృష్ణయాదవ్, సంఘము నాయకులు ముద్దం వెంకటేష్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, శేఖర్ యాదవ్, ఐలయ్య యాదవ్, శ్రీశైలం యాదవ్, వివిధ గ్రామాల యాదవ సంఘం కులస్తులకు పాల్గొన్నారు.