Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ సేవే మాధవ సేవ, మానవతా హృదయంతో వృద్ధులకు సేవ చేయడం అదృష్టంగా భావించాలి
- బడంగ్పేట్లో వృధాశ్రమం ప్రారంభం
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
సమాజంలో ఎంతో మంది దిక్కు మొక్కలేని వృద్ధులు ఉన్నారని అలాంటి వారికి మానవత్వంతో సేవ చేయడం మానవ సేవ మాధవ సేవగా భావించటం వృద్ధులకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్లో శ్రీరామ వృద్ధాశ్ర మాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సేవ దృక్పథంతో వృద్ధుల, అనాధల ఆశ్రమాలు ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనాదలు,ఎవరి తోడు లేని వారికి అన్ని తానై చూసుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు. సేవ దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న ఇలాంటి వృద్ధుల ఆశ్రమాలు సమాజం లో ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు బొల్లంపల్లి రాంబాబును మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ టీిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, అర్జున్. బిమిడి స్వప్న జంగారెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, టీిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దబావి ఆనంద్ రెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి,ఏనుగు రాంరెడ్డి,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.