Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కానిస్టేబుల్, ఎస్ఐ పోటీ పరీక్షలకు
- స్వచ్ఛందంగా ఉచిత శిక్షణ ఇస్తున్న ఫిజికల్ డైరెక్టర్ నందు నాయక్
నవతెలంగాణ-సరూర్‌నగర్
పోలీసు కొలువును సాధించాలని భావించే నిరుద్యోగ యువతకు ఆయన అండగా నిలుస్తున్నారు. పోలీస్ పరీక్షల్లో అవసరమైన ఈవెంట్స్ అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే సరూర్‌నగర్‌కు చెందిన నందు ఆర్మి ఫౌండేషన్ ఫిజికల్ డైరెక్టర్ నందు నాయక్.
రోజుకు వెయ్యి మందికిపైగా శిక్షణ
పోలీసు పోటీ పరీక్షల్లో ర్యాంకు సాధించాలంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపైనే కా కుండా శారీరక ధృడత్వంపై కూడా దష్టిసారించాల్సిందే. సామాజిక అంశాలను బోధిం చేందుకు అనేక శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. కానీ ఈవెంట్లలో తర్పీదు ఇచ్చే సంస్థలు చాలా అరుదు. పోటీ పరీక్షల్లో ఈవెంట్ మార్కులు కూడా కీలకమే. సబ్జెక్టులో మంచి మార్కులు సాధించి తీరా ఈవెంట్లలో రాణించకలేక పోతే ఉద్యోగాన్ని మిస్ అయినట్లే. అందుకే యువతకు ఈవెంట్లపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఆ మేరకు సరూర్‌నగర్ కట్టపై రోజుకు వెయ్యి మందికి రన్నింగ్, జంపి ంగ్, ఇతర ఈవెంట్లపై శిక్షణ ఇస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో కానిస్టేబుల్ ఎస్సై కోచింగ్ ఇచ్చే శిక్షణ కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పోలీసు ఉద్యోగాలకు సిద్ధమయ్యే విద్యార్థినీ విద్యార్థులు దిల్సుఖ్నగర్ లోనే ఉంటూ కోచింగ్ తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఉదయం, సాయంత్రం సమయంలో ఈవెంట్స్ కోసం సిద్ధమ య్యేందుకు ఎలాంటి గ్రౌండ్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిల్సుఖ్నగర్ సమీపంలోని విఎం హోం, సరూర్‌నగర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే అక్కడ ఉండే నిర్వాహకులు వీరికి అనుమతులు ఇవ్వడంలేదు. ఎంతో ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుని ఎస్సై, కానిస్టేబుల్ సాధించాలని పట్టుదలతో ఇక్కడికి వచ్చినా కానీ గ్రౌండ్ లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఈవెంట్స్ జరిగే వరకూ గ్రౌండ్స్‌కి అనుమతిస్తే వేలాదిమంది ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే ఆశావాహులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
పక్కా ప్రణాళికతో చదువుతున్న
సాయి కిరణ్, బి.టెక్ ఆసిఫాబాద్ జిల్లా
గత నోటిఫికేషన్లో ఎస్సై జాబ్ రెండు మార్కులతో మిస్ అయింది. ఈసారి అలా కాకుండా పక్కా ప్రణాళికతో చదువు తున్నాను. రెండు నెలల క్రితం నిర్వహించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ వచ్చేలా ఉంది. ఈవెంట్స్‌లో క్వాలిఫై అయితే జాబ్ తప్పకుండా సాధిస్తాను. ఈవెంట్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తాము. ఈవెంట్స్ పీఈటీ నందునాయక్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాను.
ప్రజా సేవ చేయడానికి యూనిఫామ్
నవిత, బి.టెక్, భద్రాద్రి కొత్తగూడెం
ప్రజాసేవ చేయడానికి యూనిఫాం పోస్టును ఎంచుకున్న. ఎస్సై కావాలని నిర్ణయించుకొని ప్రిపేర్ అవుతున్నాను. ఈసారి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండడంతో నా ఎస్సై కలను నెరవేర్చు కుంటాను. ప్రైవేటు ఉద్యోగంలో సెక్యూరిటీలకు పోగా ఒత్తిడి ఉంటాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను.
మా నాన్నని ఆదర్శంగా తీసుకొని ఎస్ఐ కావాలని నిర్ణయించుకున్నా
తేజస్విని. ఎంబిఎ
మా నాన్న కూడా సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. మా నాన్నని ఆదర్శంగా తీసుకొని ఎస్ఐ కావాలని నిర్ణయించు కున్నాను. 2019లో కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. కానీ ఎస్సై కావాలని నిర్ణయించుకొని కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరకుండా ఎస్ఐకి సన్నద్ధమవుతున్నాను. డిపార్ట్మెంట్లో ఉన్న గౌరవం, అభిమానం మరే ఉద్యోగంలో ఉండదని తెలుసుకొని ఈ ఉద్యోగానికి సిద్ధమవుతున్న.
పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను
నందు నాయక్, పీఈటీ
గతంలో ఎన్నడూ లేని విధం గా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగానికి భారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. పేద విద్యార్థుల కోసం ఉచితంగా గ్రౌండ్ శిక్షణ ఇస్తున్నాను. ఎల్బీ నగర్ ప్రాంతంలో శిక్షణ కోసం ప్రభుత్వం గ్రౌండ్ నుండి కేటా యిస్తే చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. గత నోటిఫి కేషన్లో నా వద్ద ఈవెంట్స్ శిక్షణ పొందిన వాళ్ళు జాబ్ సాధించారు.