Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ జూబ్లీహిల్స్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. సోమవారం తార్నాకలోని అర్నిత ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ప్రకృతి పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అర్నిత జెన్నీ, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్, కల్యాణ్ నగర్ వెంచర్ 3 మైత్రి టవర్స్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు.