Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్ డివిజన్ దామోదర సంజీవయ్య కాలనీలోని అంగన్వాడీ సెంటర్లో జాతీయ పోషకాహార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యమ్మ హాజరై మాట్లాడుతూ పోషకాహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా సెప్టెంబర్లో జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటామని వివరించారు. ప్రతీరోజు మనం ఆహారంలో కార్పొహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, సూక్ష్మపోషకాలు అన్నీ ఉండేలా చూసుకోవాలన్నారు. ఇవి శరీరానికి పుష్కలంగా అందితేనే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వసంత, జి. ఉమ, రామ, వనిత, రేణుక, కాంతమ్మ, సరిత, ఇర్ఫానా తదితరులు పాల్గొన్నారు.