Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎంపీఎస్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయమని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు (టీఎంపీఎస్) గారె వెంకటేష్ మాదిగ అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్యార వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి చేతులు దులుపు కోవద్దని, దళితుల అభ్యున్నతికి కషి చేయాలని అన్నారు. ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం ఎప్పుడు పెడతారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవడం బాధాకరం అన్నారు. మునుగోడులో దళితుల కోసం పనిచేసేవారికే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఇంజం సాంబయ్య, తలారి నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పన్యాల శ్రీహరి, మాదిర నర్సింగ్ రావు, గ్రేటర్ ఇన్చార్జి ఎర్రోళ్ల వెంకటేష్, ఎర్రోళ్ల తులసిరాం, మత్సగిరి, లక్ష్మయ్య, దేవయ్య, మహిళ రాష్ట్ర అధ్యక్షులు విజయ లక్ష్మి, మణెమ్మ, తార తదితరులు పాల్గొన్నారు.