Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
భవన నిర్మాణ కార్మిక కూలీల అడ్డాలలో ప్రధానమైన అడ్డాలలో కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందని, దీంతో అన్ని కార్మిక సంఘాలు ఏకమై పోరాటాల ద్వారా సాధించుకుంటామని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు కేసరి నర్సిరెడ్డి, సరూర్నగర్్ సర్కిల్ సీఐటీయూ కన్వీనర్ మల్లెపాక వీరయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి జి.చైతన్య అన్నారు. సోమవారం సరూర్‌నగర్ సర్కిల్లోని నాగోల్ డివిజన్లో గల న్యూ నాగోల్‌లో భవన నిర్మాణ కార్మిక సంఘం యూనియన్ సీిఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో బాలస్వామి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని వారు ముఖ్య అతిథులుగా పాల్గొని గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరూర్నగర్్ సర్కిల్లో ప్రధానంగా భవన నిర్మాణ కూలీలకు ఐదు అడ్డాలు ఉన్నాయని, అట్టి అడ్డాలలో తాగునీటి సౌకర్యంతోపాటు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ కమిషనర్‌కు మొరపెట్టుకున్నా ఫలితంలేకపోయిందని, దీంతో అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి పోరాటాల ద్వారా తమ హక్కులను సాధించుకుంటామని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుడిపై పెను భారం మోపిందని దీంతో జీవనం సాగించడం కష్టతరంగా మారిందని అన్నారు. రాబోయే రోజుల్లో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కార్మికుల ఐక్యతతో తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ సీఐటీయూ నాయకులు ఆలేటి ఎల్లయ్య, కెేవీపీిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.మనోహర్, నాగోల్ డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శంకర్, రవి, చంద్రయ్య, బొందయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.