Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ సుదర్శన్
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్లోని 3వ వార్డులోని నబిల్ కాలనీ, వాది ఏజుబాన్ కాలనీలలో నెలకొని ఉన్న డ్రయినేజీల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖైసర్ బామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కాలనీ వాసులతో కలసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అందుకుగాను మంత్రి అదేశంతో కమిషనర్ సుదర్శన్, డీఈఈ వెంకన్న, ఏఈ అయేషాలు కాలనీలో పర్యటన చేసి కాలనీ డ్రయినేజీలు లేక రోడ్లపై మురికి నీరు ప్రవహించటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డ్రయినేజీలు లేని కాలనీలో అధికారులు పర్యటించి సమస్యలను పరిశీలించి డీపీఆర్ ప్రతిపాదనలు తయారు చేసి మంత్రికి నివేదికను పంపనునట్లు ఖైసర్ బాం తెలిపారు. కాలనీలలో నెలకొని ఉన్న సమస్యలను సత్వర పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు.