Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
కొత్తపేట్‌లో అపోలో 1500వ డయాగస్టిక్ సెంటర్‌ను అపోలో డయాగ్నోస్టిక్స్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్, విశ్వజిత్‌రెడ్డి కొండా హాజరై ప్రారం భించారు. మాట్లాడుతూ కొత్తగా ప్రారంభమైన ఈ సువిశాలమైన పాథాలజీ సెంటర్ 3,000 కంటే ఎక్కువ టెస్టుల సమగ్ర మెనూని అందిస్తుంది అని, ఇవన్నీ కూడా అత్యంత అనుభవజ్ఞుల్కెన పాథాల జిస్టుల పర్యవేక్షణలో నిర్వహించబడు తాయి అని తెలిపారు. హైదరాబాద్ ్లో100వ కేంద్రాన్ని ప్రారంభించడం పై మాకు చాలా ఆనందంగా ఉంది, ఇది నివారణ సంరక్షణ పట్ల మా చైర్మెన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి యొక్క దార్శనికతకు మమ్మల్ని మరింత చేరువచేస్తుంది. మేము రోగి ఇంటి గడప వద్దకే స్పెషాలిటీ హై-ఎండ్ టెస్టింగ్‌ను అందుబాటులో ఉంచడానికి, వారితో దీర్ఘకాలిక సంబంధాన్ని ఏర్పరచు కోవడానికి పనిచేస్తున్నాం అన్నారు. దేశవ్యాప్తంగా 3000 నుండి 4000 పాథాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యంగా పెట్టుకున్నాం అని తెలిపారు. అపోలో క్రెడిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అపోలో ఫెర్టిలిటీ, అపోలో స్పెక్ట్రా, అపోలో క్లినిక్స్, అపోలో షుగర్, అపోలో డెంటల్, అపోలో డయాగ్నోస్టిక్స్ మరియు అపోలో డయాలసిస్ వంటి తన 8 ముఖ్యమైన విభాగాలతో పనిచేస్తుంది. కార్యక్రమంలో అపోలో డయాగ్నోస్టిక్స్, సీఈఓ, సుశాంత్ కిన్రా, అపోలో డయాగ్నోస్టిక్స్, వైస్ ప్రెసిడెంట్, దేవేంద్రసింగ్ రాజ్‌పుత్ తదితరులు పాల్గొన్నారు.