Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఈ నెల 29వ తేదీన వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని డిపార్టుమెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగంను ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ మోహనరావు ప్రారంభించారు. ఈకార్యక్ర మానికి ముఖ్య అథితిగా డిస్ట్రిక్ట్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ మోహనరావు, చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహే ష్ దెగ్లూర్కర్, డాక్టర్ సాకేత్ -కార్డియాలజిస్ట్, డాక్టర్ రణధీర్-న్యూరోసర్జన్ హాజరరయ్యారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ సకాలం లో చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. క్లిష్ట సమయాల్లో ప్రతి నిమిషం ముఖ్యమైనది అనీ, జీవితాలను రక్షించటానికి ఇలాంటి అత్యాధునిక సదుపాయాలు ఎంతో ముఖ్యం అన్నారు. మహేష్ దెగ్లూర్కర్ మాట్లా డుతూ నాణ్యమైన వైద్యసేవలు, అత్యాధునికమైన వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం గల మెడికవర్ హాస్పిటల్స్ డిపార్టుమెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం ప్రారంభించడం సంతోషంగా ఉన్నదన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాధారణంగా మన జీవితాలు ఒత్తిడితో కూడుకున్నవనీ, తగినంతగా నిద్ర లేకపోవ డం, అనారోగ్య కారణాల వల్ల ఒత్తిడి కనిపిస్తుంటుం దన్నారు. సాధ్యమైన అంతవరకు మనసుని ప్రశాం తంగా ఉంచితే గుండె ప్రశాంతగా ఉంటదనీ, అప్పు డు ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయన్నా రు. డాక్టర్ సాకేత్ మాట్లాడుతూ గుండెపోటు రావ డానికి గల సాధారణ కారణాలు గురించి తెలుసు అన్నారు. ఒళ్లు నొప్పులు, నీరసం ఆవరించడం, నిద్ర లేమి, ఆందోళన, కోపం, డిప్రెషన్ కలగడం, అస హనం, మతిమరుపు కనబడతాయనీ, ఇవన్నీ ముందుగా గుర్తించి సరైన సమయంలో హాస్పిటల్కి వెళితే ఎలాంటి స్ట్రోక్ బారిన పడకుండా ఉంటాం అన్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకో వడం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండా ఉండొ చ్చు అన్నారు. గుండె ఆరోగ్యం కోసం కనీసం 30 నుంచి 40 నిమిషాలు వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేస్తే ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతు ందన్నారు. డాక్టర్ రాజేష్ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని లక్ష్యంతో ఇప్పుడు బేగం పేటలో ఈ విభాగాన్ని ప్రాంభించినందుకు సంతో షంగా ఉందన్నారు. అనంతరం రూ.499 హార్ట్ స్క్రీ నింగ్ ప్యాకేజీని విడుదల చేశారు.కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మేఘ, బేగంపేట్ మెడికవర్ హాస్పి టల్స్ సెంటర్ హెడ్ రుషికేశ్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.