Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్ నగర్
క్రైస్తవుల ఆస్తుల రక్షణ, సంరక్షణ కోసం ముందడుగు వేయాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాన్ మాస్క్ అన్నారు. మంగళవారం నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ఆధ్వర్యంలో 200 మంది క్రైస్తవ న్యాయవాదుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా సుప్రీంకోర్టు న్యాయవాది రాబర్ట్ విచ్చేసారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని హై కోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు విచ్చేసి రాష్ట్ర వ్యాప్తం గా వివిధ జిల్లాలో క్రైస్తవులపై జరుగుతున్న అరాచకాలపై చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా జాన్ మాస్కుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. యువ నాయకుడు క్రైస్తవుల శ్రేయస్సు కోసం అవసరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు క్రైస్తవులుగా ఉండి పడుతున్న అవమాలపై ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ లో అక్రమాలకు గురైతున్న క్రైస్తవుల ఆస్తుల సంరక్షణపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసినట్టు ఈ సమావేశంలో తెలిపారు. దేశవ్యాప్తంగా క్రైస్తవుల ఆస్తులలో ముఖ్యంగా వరల్డ్ మిషన్ ఫర్ ఏవంజలిజం, ఆంధ్ర ఏవంజలికల్ లూథరన్ చర్చి హెబ్రోన్, మెనోనైట్, మెతడిస్ట్, తెలుగు బాప్టిస్ట్ ఆస్తులను సొసైటీ యాక్ట్‌ను పక్కదారి పట్టించి కంపెనీ యాక్ట్ ద్వారా ఈ సంస్థ ఆస్తుల ను అమ్ముకున్నట్టు తెలిపారు. కొన్ని ఆస్తులను లీజ్ పేరుతో అమ్మినట్టు తెలిపారు. ఈ సంస్థల ఆస్తులను కాజేసిన దొంగలను త్వరలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని న్యావాదులకు తెలిపారు.