Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్లో విధులు నిర్వ హిస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య భద్రత నిమిత్తం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు శంకర్ తెలిపారు. మున్సి పల్ కార్యాలయంలో నిత్యం విధులలో మునిగిపోయి తీవ్ర ఒత్తిడిలో పనిచేసే ఉద్యోగులకు వారి ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత విషయంలో ప్రత్యేకంగా వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వ హించారు. బీపీ, షుగర్, దంత, హృదయ, కంటి వైద్య పరీక్షలను నిర్వహించి వైద్యుల సలహాలు మేరకు మందు లను కూడా పంపిణీ చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీలో ఉన్న హెల్త్ విభాగం ఈ ఉచిత హెల్త్ క్యాంపు నిర్వ హించకపోయినా తమ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యో గుల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రకాష్, నర్సింగ్, పాండు, జగదీష్ పాల్గొన్నారు.