Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రయివేటు విద్యాసంస్థలు గవర్నమెంట్ ప్రకటించిన సెలవులను టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రయివేటు టీచర్స్, లెక్చరర్స్ సంఘం రాష్ట్ర నాయకులు ఏ.విజరు కుమార్, మేడ్చల్ జిల్లా నాయకులు సైదులు, నాయకులు శ్రీనివాస్, శివ ప్రచండ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తరపున అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 25 నుంచి అక్టోబరు 9 వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విజయం అందరికీ తెలిసిందే అన్నారు. కానీ కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంకా ఆన్లైన్లో క్లాసులు చెప్పిస్తున్న ట్టు తెలిపారు. ఇలా నడుపుతున్న కార్పొరేట్ పాఠ శాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సెలవులను ప్రభుత్వం ఇచ్చినా ఆఫీస్లు తెరిచి ఉంచి టీచర్స్ని ఈ నెల 30వ తేదీ వరకు హాజరు కావాలని చెబుతు న్నట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవులు విద్యార్థులకు మాత్రమే కాదు, విద్యాసంస్థలు అన్నీటికీ అన్నారు. అంటే టీచర్స్కి కూడా సెలవులు ఇవ్వాలి కానీ ఎక్కువ పాఠశాలలు సెలవులు ఇవ్వ కుండా వివిధ పనులు చేపించుకుంటున్నట్టు తెలి పారు. ఏడాదంతా టీచర్స్ బోధ నేతరపనులు కూడా చేస్తూ, విపరీతమైన ఒత్తిడికి గురి అవుతున్నార న్నారు. ప్రయివేటు పాఠశాలలు అన్నీ వెంటనే టీచర్స్కి కూడా సెలవులు ఇవ్వాలనీ, ఇంకా ఇవ్వని పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అడిషనల్ డెరక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.