Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఔత్సాహికులైన నలుగురు పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన స్టార్టప్ టు హాండ్స్ ప్రయివేటు లిమిటెడ్ చిన్న, మధ్యతరహా వ్యాపారాల కోసం స్మార్ట్ లావాదేవీల లెక్కింపు పరిష్కారాలను అందించడానికి, సులభంగా ఉపయోగించ గలిగిన, ప్రపంచంలోనే మొట్టమొదటి వినూత్న స్మార్ట్ కాలిక్యులేటర్ పరికరం టు హాండ్స్ స్మార్ట్ కాలిక్యులేటర్‌ను ఆవిష్కరించింది. ఈ ఇంటెలిజెంట్ కాలిక్యులేటర్ మొబైల్లోని టుహాండ్స్ యాప్ ద్వారా నిర్దిష్ట వ్యవధిలో ఆదాయం, ఖర్చులతో సహా దుకాణదారులు తమ ఇన్‌స్టోర్ లావాదేవీలన్నింటినీ ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథి హాజరై టుహాండ్స్ స్మార్ట్ కాలిక్యులేటర్‌ను టి- హబ్ ఫేజ్ 2 వద్ద లాంఛనంగా ప్రారంభించారు. ఈ కారక్రమంలరలో టి-హబ్ సిఇఒ శ్రీనివాస్ రావు, టిఎస్ఐసి, సిఐఒ శాంత తౌతం, టుహాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన యువకులైన నలుగురు ఆవిష్కర్తలు, ఫౌండర్ చీఫ్ ఎవ్రీథింగ్ ఆఫీసర్, ప్రవీణ్ మిశ్రా, ఆల్ థింగ్స్ టెక్, సత్యం సాహు, చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్, షణ్ముగ వడివేల్, ఆల్ థింగ్స్ గ్రోత్, అరవింద్ సుబ్రమణియన్ పాల్గొన్నారు.