Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఘనంగా నిర్వహించారు. సంస్థ ప్రధాన కార్యాలయ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమా రెడ్డి ముఖ్య అథితిగా హాజరై లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి నివాళ్లర్పించి మాట్లాడారు. బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ మన రాష్ట్రం గర్వించే గొప్ప నేత అన్నారు. సాయుధ పోరాట కాలంలో పలువురికి న్యాయవాదిగా సేవలు అందించి వారి తరపున న్యాయ పోరాటం చేసిన ప్రజాస్వామిక వాది అనీ, వారి చేసిన నిస్వార్ధ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.శ్రీనివాస్, కె.రాములు, జి.పర్వతం, సీహెచ్ మదన్ మోహన్ రావు, ఎస్.స్వామి రెడ్డి, జి.గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.