Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
తల్లిదండ్రుల ప్రాపర్టీని మొత్తం తన సోదరుడే అక్రమంగా ఆక్రమించుకున్నాడని సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎంఎస్ ఫాతిమా ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తల్లిదండ్రుల ప్రాపర్టీని మొత్తం తన సోదరుడే అక్రమంగా ఆక్రమించుకున్నాడని, ఇదే విషయమై హైకోర్టులో, హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను సంప్రదించానన్నారు. తన సోదరి అనారోగ్యంతో బాధపడుతున్నా వైద్యం చేయించట్లేదని ఆవేదనవ్యక్తంచేశారు. ఆమెకు తక్షణమే మంచి వైద్యం అందించాలని, తన తల్లిదండ్రుల ఆస్తులను అక్రమంగా తనపరం చేసుకున్న సోదరుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.