Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై అనేక కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఎస్.కె ఫంక్షన్ హాల్లో వృద్ధులకు, వికలాంగులకు, వీడో పింఛన్లు కార్డులను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటూ తెలంగాణను బద్నాం చేస్తుందని విమర్శించారు. కాగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఫొటో లేదని అధికారులపై ఆగ్రవ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. కార్యక్రమంలో అంబర్పేట ఎమ్మార్వో సీహెచ్ లలిత, పలువురు నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.