Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, సేవారత్న డాక్టర్ ఎస్.ఎం.హుస్సేనీ(ముజీబ్) నేతృత్వంలో ఆ సంఘం కార్యాలయంలో స్వతంత్ర సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి పురస్కరించుకొని మంగళవారం జిల్లా కార్యవర్గంతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారిని ఎదిరించడంతో పాటు నిజాంనీ ఎదిరించాడని తెలిపారు. చిట్యాల (చాకలి)ఐలమ్మ కేసు వాదించి విసునూర్ దేశముఖ్పైన విజయం సాధించారని, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని ఆయన గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా నీతి నిజాయతీతో సమర్ధవంతంగా పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విక్రమ్, ఉపాధ్యక్షులు కె.ఆర్. రాజ్ కుమార్, కుర్రాడి శ్రీనివాస్, సభ్యులు ఖాలీద్ అహ్మద్, ఎస్.మురళీరాజ్ , యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు ముకీం ఖురేషి, జాలీల్ అహ్మద్, పద్మ, పీఆర్వో జహంగీర్ అలీ, ఏపీఆర్వో ఎం.డీ వహీద్, ముహమ్మద్ ముస్తఫా, ఉస్మాన్ అలీ ఉస్మాని తదితరులు పాల్గొన్నారు.