Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
తొలితరం స్వరాష్ట్ర ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కాంగ్రెస్‌పార్టీ మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన కొండా లక్ష్మాణ్ బాపూజీ జయంతి వేడుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రామకృష్ణాపురం డివిజన్, సరూర్‌నగర్‌లో, టెలిఫోన్ కాలనీ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్వరాష్ట్రం కోసం పరితపించిన తొలితరం ఉద్యమకారుడు, న్యాయవాది, మాజీ మంత్రివర్యులు, రాజకీయాలకు వన్నెతెచ్చిన మహానుభావుడు'' అని కొండా లక్ష్మణ్ బాపూజీని కొనియాడారు. తెలంగాణలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని, జలదృశ్యంలో బాపూజీ స్మృతివనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు, ఎస్సీ సెల్ కన్వీనర్ బండి మధుసూదన్‌రావ్, రాష్ట్ర యువజన నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి, నల్లంకి ధనరాజ్ గౌడ్, పిట్ల రవీంద్ర, తల్లాటి రమేష్ నేత, జిల్లా జగన్నాథం, పున్న కృష్ణయ్య, సిహెచ్ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.