Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మోహన్ రావు కాలనీలో డిప్యూటీ మేయర్ పార్టీ కార్యాలయంలో మంగళవారం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళ లకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ టీచర్లు, ఆశా, ఆర్పీలకు సొంత ఖర్చులతో చీరలను పంపిణీ చేసినట్టు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, నాగరాణి దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు గతంలో తక్కువ జీతాలతో పని చేసారనీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి జీతాలు పెంచి వారి కుటుంబాల్లో వెలు గులు నింపారన్నారు. ఆశాలకు కూడా జీతాలు పెంచారనీ, అర్పిలు మహిళా సంఘాలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే వారి కుటుంబాలు బలంగా ఉంటాయన్నారు. మహిళలకు అత్యధికంగా రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు. అర్పిలు పాల్గొని కానుకలు అందుకుని డిప్యూటీ మేయర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.
9వ డివిజన్లో..
మున్సిపల్ కార్పొరేషన్లోని 9వ డివిజన్ కార్పొరేటర్ శారదా మనోదర్ రెడ్డి సుక్కమ్మ బస్తి రేషన్ షాపులో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మన పండగ, మన సంస్కృతి, మన సాంప్రదాయానికి ప్రతీక అన్నారు. ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక అన్నారు. ఈ బతుకమ్మ పండుగను కార్పొరేషన్ ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలన్నా రు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేష. స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.