Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ అండ్ ఎలక్షన్ జూబ్లీహిల్స్‌లోని జూబ్లీ ఇంటర్నేషన ల్ సెంటర్లో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో షూటింగ్ క్రీడలను ప్రోత్సహించడానికి అసోసియేషన్ చేస్తున్న కృషి, కొత్త ప్రతిభను పెంపొందించం, యువతలో అవగాహన కల్పించడానికి సభ్యులకు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. అసోసియేషన్ 2021-22 విజయాల ను ప్రదర్శించింది. టీఆర్ఏ అధ్యక్షుడు అమిత్ సంఘీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గుస్తీ నోరియాతో కలిసి సమా వేశంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడం, గుర్తించడం కోసం ఏర్పడిన బృందాన్ని జనరల్ సెక్రెటరీ జె.కిరణ్, అతని బృందాన్ని వారు అభినందించారు. సొసైటీ చట్టాల ప్రకా రం నియమితులైన కొత్త కమిటీ, పాత అసోసియేషన్ సభ్యులను కూడా ప్రశంసించారు. పి.అమరేందర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది రిటర్నింగ్ అధికారిగా నియమితుల య్యారు. సమావేశానికి హాజరైన సభ్యులందరికీ ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. నేషనల్ రైఫిల్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా కళ్యాణ్ సింగ్ కపాసియాను పరిశీలకుడిగా నియమించింది. తెలంగాణ ఒలింపిక్ సంఘం పరిశీలకుడిగా ఎం.రామకృష్ణను, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అలెగ్జాండర్ ఫ్రాన్సిస్‌ను పరిశీలకునిగా నియమించింది.
కొత్తగా ఎన్నికైన సభ్యులు
అధ్యక్షుడిగా అమిత్ సంఘీ, సీనియర్ వైస్ ప్రెసిడెం ట్‌గా గుస్తీ నోరియా, ఉపాధ్యక్షునిగా ఉదరు పిలానీ, కోశాధికారిగా జి.ప్రతాప్ కుమార్, ప్రధాన కార్య దర్శిగా జె.కిరణ్, జాయింట్ సెక్రెటరీలుగా సబీర్ అలీ ఖాన్, మహ మ్మద్ వాజిద్‌ఖాన్, కార్యనిర్వాహక సభ్యులుగా జె.పథ్వీరెడ్డి, బొబ్బిలి నర్సయ్య, కె.శ్రవణ్ కుమార్, డా.వంశీధర్ నలి, మహమ్మద్ ముస్తఫా ఖాన్, మహమ్మద్ హసన్ షరీఫ్ నియమితులయ్యారు. ప్రెసిడెంట్ మాట్లాడు తూ ''ప్రతిభ మరెవరూ చేధించలేని లక్ష్యాన్ని చేధిస్తుంది'' అని అతను పునరుద్ఘాటించాడు. అత్యుత్తమ ప్రతిభ, వృద్ధి అవకాశాలను ఆకర్షించడానికి పరివర్తనను కొనసాగించా ల్సిన అవసరం ఉందన్నారు. నిరంతర శిక్షణ, అభ్యాసంలో వైవిధ్యం, కఠినమైన క్రమశిక్షణ, అంకితభావం ద్వారా ఈ పరివర్తన సాధించబడుతుంది. జాతీయ క్రీడల నిర్వహ ణకు హైదరాబాద్ షూటింగ్ రేంజ్ హబ్‌గా మారేలా ప్రాథమిక సౌకర్యాలతో ఎక్కువ సంఖ్యలో షూటర్లు పాల్గొనేందుకు వీలుగా షూటింగ్ రేంజ్‌లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించి, విడుదల చేయాలని సంఘీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా భ్యర్థించారు.