Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- మీర్‌పేటలో ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ
నవతెలంగాణ-మీర్పేట్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని సందె చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. వెట్టి చాకిరీ విముక్తి కోసం దొరలకు, పెత్తందారులకు, నైజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. ఆనాడు స్త్రీలకున్న ప్రతికూల పరిస్థితుల్లో సైతం అన్యాయాన్ని ఎదిరించి పోరాటం చేసిన స్ఫూర్తిని నేడు మహిళలు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని తెలిపారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వం ఉందని చాటి చెప్పడానికి వీరనారి ఐలమ్మ జీవితం నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రజకులు పట్ల వృత్తిదా రుల పట్ల గౌరవం ఉందన్నారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్స వాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. రజకులకు ఉచిత విద్యుత్, మోడల్ దోబీగాట్లు ఏర్పాటు, తదితర అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. త్వరలోనే మీర్ పేట్, జిల్లెలగూడలో రూ.30లక్షలతో మోడల్ దోబీగాట్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, ఏఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పద్మ భాస్కర్ రెడ్డి, పెండ్యాల నర్సింహా, కరుణానిధి, రజక సంఘం, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.