Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ పోరాట నాయకులు
- ఎస్.కె.మీరా వికలాంగులకు పిలుపు
నవతెలంగాణ-జవహర్ నగర్
జవహర్ నగర్ ప్రాంతంలోని అర్హులైన వికలాంగుల కు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని గుడిసెవాసుల భూ పోరాట నాయకులు ఎస్.కె.మీరా డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, కాప్రా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, బాలాజీనగర్ లోని వికలాంగుల కాలనీలో గల మగ్ధుమ్ భవనంలో కార్మిక మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు షేక్ మస్తాన్ అధ్యక్షతన వికలాంగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు వికలాంగులను ఉక్కిరిబిక్కిరి చేస్తు న్నాయన్నారు. పాలకులు ఇస్తున్న ఆసరా ఫించన్లు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. వికలాంగులను చూసి జాలిపడటం కాతనీ, వారిని అన్నిరకాల వివక్షతల నుంచి సంపూర్ణ విముక్తిని సాధించేలా అధికారంలో ఉన్న పాలక ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ లాంటి పట్టాల్లో వికలాంగులకు తగిన చేయూతను అందించి, ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలన్నారు. సరైన విద్య, వైద్యం లేక నేటికీ వికలాంగులు పలు మాన సిక శారిరక బాధలను అనుభవస్తున్నారని గుర్తు చేశారు. వికలాంగుల పట్ల ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఎవరైనా అమానుషంగా నిందించినా, దాడిచేసి గాయపరిచినా, బాధపడేలా చేసినా వారిని వికలాంగులకు రక్షణను కల్పించే అనుకూల చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ నేటికీ అభద్రతా భావంలోనే ఉన్నారన్నారు. ఇప్పటికైనా అర్హులైన వికలాంగులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలనీ లేదంటే భవిష్యత్తులో కార్మిక మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్.కే.మీరా నాయకత్వాన ప్రభుత్వ భూము ల్లో జరిగే గుడిసెవాసుల భూపోరాటాల్లో వికలాంగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని షేక్ మస్తాన్ హెచ్చరించారు. అంగవైకల్యం శరీరానికే కానీ, పోరాటానికి కాదు కదా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ మున్నా, మోనార్క్ దుర్గాప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, అమరేందర్, పాండు, నయీమ్, భిక్షపతి, సదానందం, ముక్క ఉపేందర్, బాలనర్సయ్య, అనూక్ పాల్గొన్నారు.