Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
ఏండ్లుగా వరద ముంపునకు గురవుతున్న ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలో చనతోనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళ వారం ఆదర్శనగర్‌లో గల తన కార్యాలయంలో ప్రాజెక్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రూ.45 కోట్లతో చేపట్టిన బేగంపేట నాలా, రూ.10 కోట్లతో చేపట్టిన పికెట్ నాలా పై చేపట్టిన బ్రిడ్జి విస్తరణ నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రతి ఏడాదీ వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరదనీటితో బేగంపేట నాలా పరిధి లోని బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీ, ప్రకాష్‌నగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగరంలో ఉన్న అనేక నాలాల వద్ద ఇదే పరిస్థితులు ఉన్నాయనీ, గత పాలకులకు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకోలేదనీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగంగా బేగంపేట నాలాకు ఇరువైపుల రిటైనింగ్ వాల్స్ నిర్మాణంతోపాటు పూడిక తొలగించే పనులను చేపట్టి నట్టు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే ఈ ఏడా ది వరద ముంపు సమస్య ప్రభావం తీవ్రత చాలా తగ్గిం దని తెలిపారు. పికెట్ నాలా నూతన బ్రిడ్జిని విస్తరించి నిర్మించడం వల్ల ముంపు సమస్య పరిష్కారం కానున్నదని చెప్పారు. పికెట్ నాలాపై ఇప్పటికే ఒక వైపు బ్రిడ్జి నిర్మాణం పూర్తయి రాకపోకలు కొనసాగుతున్నాయనీ, రెండోవైపు పనులు అక్టోబర్ 20వ తేదీ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రానున్నట్టు చెప్పారు. పను లను మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సమా వేశంలో భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, సునీల్ పాల్గొన్నారు.