Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ పండగ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నా రు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మంగళవారం శామిర్పేట కలెక్టరేట్ ఆవరణలో కోలాటాలు, బతుకమ్మ ఆటలతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి విద్యార్థినులతో కలిసి కోలాటం ఆడి సంబరాల్లో పాలుపంచుకున్నారు. జిల్లా విద్యాశాఖ, మత్స్య శాఖ, లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరా లను నిర్వహించగా జిల్లా నుంచి విద్యార్థినులు పెద్ద సంఖ్య లో తరలివచ్చి బతుకమ్మ, కోలాటాల ఆటలతో సందడి చేశారు. జిల్లా స్థాయి మహిళా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది బతుకమ్మ ఆడారు. అందంగా రంగురం గుల పూలతో పేర్చిన బతుకమ్మను మధ్యలో మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారిణి విజయకుమారి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వ ర్లు, ఆయా శాఖల మహిళా అధికారులు పాల్గొన్నారు.