Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయూష్ మినిస్ట్రీ ఆఫ్ సీసీఎం సభ్యులు డాక్టర్ సూర్యంపల్లి సారంగపాణి
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రతిభ ఎవరి సొత్తూ కాదని, దాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆయూష్ మినిస్ట్రీ ఆఫ్ సీసీఎం సభ్యులు డాక్టర్ సూర్యంపల్లి సారంగపాణి అన్నారు. మంగళవారం చాదర్‌ఘాట్‌లోని సీతారామాలయ ఆడిటోరియంలో నాయీ బ్రాహ్మణ జన సంస్థ ద్వితీయ వార్షికోత్సవ సభ నిర్వహించారు. అనంతరం సారంగపాణి మాట్లాడుతూ ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదని, అది అందరిలో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన డాక్టర్ వెంకటేష్, సుంకర రమాదేవి, నాగవెల్లి సురేష్, కందుకూరి నరసింహారావు, సిద్దులు, జనగామ ఉమాదేవి, సమ్మెట కిన్నెర, నాంపల్లి శ్రీనివాస్, కె. రమేష్, శ్రీరాములు, ఎన్ శ్రీనివాస్ లకు పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సాహితీవేత డాక్టర్ రాపోలు సుదర్శన్ సభ అధ్యక్షులుగా వ్యవహరించారు. నాయీ బ్రాహ్మణులో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి ప్రతీఏటా వారికి అవార్డులు అందజేస్తున్నామని సంస్థ అధ్యక్షులు శ్రీధర్ మురహరి చెప్పారు. కార్యక్రమంలో అడ్వకేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాస్త్ర ప్రధాన కార్యదర్శి ఎం లింగం నారాయణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం సురేష్, చీకటి వెలుగు దినపత్రిక ఎడిటర్ కంది సూర్యనారాయణ, ప్రముఖ అడ్వకేట్ ఎస్ భూపాల్ రాజ్, సీతారామాలయ మాజీ చైర్మెన్ గోవిందరాజు, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, అడ్వకేట్ సుధాకర్, ఓయూ జేఏసీ ఫౌండర్ చైర్మెన్ జంపాల రాజేష్, నారు తదితరులు పాల్గొన్నారు.