Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
భగత్‌సింగ్ జయంతి వేడుకలను ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన గొప్ప విప్లవ పోరాట యోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరి దీనికి అనుబంధంగా భారత నవజవాన్ సభ స్థాపించి దేశంలోని యువకులకు జాతీయత భావాలు, విప్లవభావాలు, దేశభక్తి నేర్పించారని గుర్తుచేశారు. అలాంటి గొప్పవ్యక్తి చరిత్రను నేడు కర్ణాటక ప్రభుత్వం పాఠ్యపుస్తకాల నుంచి తీసివేయడం సిగ్గుచేటు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి నిజమైన దేశభక్తి, జాతీయత భావాలు ఉంటే ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు రామాటేంకి శ్రీను, సాయి కిరణ్, నాయకులు సతీష్, మంజునాథ్, దిలీప్, లింగస్వామి, శ్రీనాథ్, రాకేష్, అజయ్, హరీష్, నరేష్, సాయికృష్ణ, అఖిల్ పాల్గొన్నారు.