Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
కొత్తపేటలోని పీవీటీ మార్కెట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పీవీటీ ఫౌండర్ కమిటీ అధ్యక్షులు భారత పురుషోత్తం, కోశాధికారి కైరంకొండ సత్యనారాయణ, డైరెక్టర్లు జెల్ల లక్ష్మీనారాయణ, పెండెం జనార్దన్ హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పదవులు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. బీసీలకు కుల సంఘాలను ఏర్పాటు చేశారని అన్నారు. కార్యక్రమంలో పీవీటీ మర్చంట్ కమిటీ అధ్యక్షులు కైరం కొండ ధనుంజయ, ఉపాధ్యక్షులు బొడ్డు శ్రీధర్, కార్యదర్శి భువనగిరి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి తడక కష్ణ, కోశాధికారి చెరుకు బిక్షపతి, డైరెక్టర్లు ప్రసాద్ కుమార్, సురేష్, రెడ్డయ్య, పోచయ్య, రాజేంద్రప్రసాద్, రాజు పాల్గొన్నారు.