Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ/బంజారాహిల్స్/సుల్తాన్‌బజార్
ఓయూ ఆడిషనల్ చీఫ్ వార్డెన్ కార్యాలయంలో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. చీఫ్ వార్డెన్ డా.కోరెముల.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యం వృత్తిరీత్యా బిజీగా ఉండే వర్కర్స్ ఇలా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం హర్షణీయం అన్నారు. ఉద్యోగుల ఉన్నతికి, వారి సంక్షేమం కోసం తమ తోడ్పాటు ఉంటుందన్నారు. బతుకమ్మ సంబరాల్లో డా.కొత్త.లక్ష్మారెడ్డి, డా.సౌమ్య, నారాయణ, నిర్మల, సునీత, వసంతి, శ్యామల, వాణితో పాటుగా మెస్వర్కర్స్, ఎడ్వేటర్స్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
కోఠి డీఎంహెచ్ఎస్ ఆవరణలో..
కోఠి డీఎంహెచ్ఎస్ ఆవరణలో బతుకమ్మ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, ఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు ఎం ప్రభాకర్, క్రాంతి, హరి, కె శశి శ్రీ, రామలక్ష్మి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీ కలినరీ అకాడమీలో..
ఖైరతాబాద్‌లోని రీజెన్సీ కలినరీ అకాడెమీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో బతుకమ్మ సంబురాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్స్, కాలేజీ స్టాఫ్ ట్రెడిషనల్ స్టైల్లో రెడీ అయి బతుకమ్మల చుట్టూ ఆడి పాడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ పోటీలను నిర్వహించి విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం స్టూడెంట్స్ సారీస్, ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ర్యాంప్ వాక్ చేశారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని కాలేజీ నిర్వాహకులు ఉమా బాల తెలిపారు.
మహిళలకు ప్రత్యేకమైనది
అందరికీ ఆనందదాయకమైన బతుకమ్మ పండుగ మహిళలకు మరింత ప్రత్యేకమైనదని నవచైతన్య కళాశాల డైరెక్టర్లు వి.వి.హనుమంతరావు, వి.కృష్ణ అన్నారు. బుధవారం నారాయణగూడ, హిమాయత్‌నగర్‌లోని నవచైతన్య కళాశాల బ్రాంచీలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకల పేర్లను, వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.